3 June, 2026 | 1:40 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణిగా డి. వాసంతి బాధ్యతల స్వీకరణ

03-06-2026 12:23 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి (ౄEO)గా శ్రీమతి డి. వాసంతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా విధులలో చేరిన జిల్లా విద్యా శాఖాధికారిణి వాసంతి జిల్లా విద్యాశాఖా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్  శ్రీ శంభు ప్రసాద్  కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చంతో  స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ఫలితాల పెంపు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక కృషి చేస్తానని  డి. వాసంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.