3 June, 2026 | 12:52 AM

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

03-06-2026 12:22 AM

ఇల్లెందు, జూన్ 2, (విజయక్రాంతి): అనేకమంది పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయం, సింగరేణి క్యాంప్ కార్యాలయాల్లో మంగళవారం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని కొని ఆడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూరు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.