12 June, 2026 | 10:31 AM

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్మికుడిని సన్మానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

12-06-2026 09:51 AM

బెల్లంపల్లి,( విజయ క్రాంతి): "కీ బోర్డ్ ప్లేయింగ్ మ్యూజిక్" విభాగంలో 22 దేశాల కళాకారులతో జరిగిన పోటీలో తలపడి గిన్నిస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన మంతెన భాస్కర్ ను  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సన్మానించారు. ఫిబ్రవరి 2వ తేది, 2026 లో గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు సాధించిన భాస్కర్ ను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ శాలువా కప్పి సత్కరించారు. బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన భాస్కర్ శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి దేశంలోనే సింగరేణి కి ఎనలేని ఖ్యాతి తెచ్చిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ ను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి కూడా శాలువాతో ఘనంగా సన్మానించచారు. "కీ బోర్డ్ ప్లేయింగ్ మ్యూజిక్" విభాగంలో గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు సాధించి, జిల్లాకు, బెల్లంపల్లి నియోజకవర్గంకు పేరు తీసుకురావడం గర్వకారణమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా  భాస్కర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావ రమేష, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు..