16 April, 2026 | 10:07 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పాలు కొనుగోలు చేయాలని పాడి రైతుల ధర్నా

02-03-2026 12:00 AM

బచ్చన్నపేట. మార్చి 1 (విజయక్రాంతి) : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామకు పాలు తరలించడం వల్ల తమకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెల్లవారు జామున నాలుగు గంటలకే గ్రామం నుంచి జనగాం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో బిల్లులు కూడా రావడం లేదని, మేనేజర్ డిడి, సూపర్వైజర్, బీఎంసీ చైర్మన్ లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . తమ సమస్య పరిష్కరిస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

తమ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన బచ్చన్నపేటలో పాలు తీసుకునేలా అనుమతులు ఇవ్వాలని  కోరారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులు వచ్చి ఇకనుంచి పాలు బచ్చన్నపేటలోనే తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.