27 June, 2026 | 2:14 AM

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు గ్రీన్ సిగ్నల్

27-06-2026 01:21 AM

దశాబ్దాల కల సాకారం

సీఎం సమీక్షతో ప్రాజెక్టు నిర్మాణంలో కదలిక

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక రైతాంగం

రంగారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): దశాబ్దాల నిరీక్షణ.. లెక్కలేనన్ని సర్వేలు.. ఎన్నో రాజకీయ పోరాటాలు.. వీటన్నింటికీ ఎట్టకేలకు తెరపడింది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంత రైతాం గం కలల ప్రాజెక్టు అయిన ‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్’ నిర్మాణానికి అడుగులు శర వేగం గా పడుతున్నాయి.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంత్య భాగమైన ఈ రిజర్వాయర్ భూసేకరణకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం పచ్చజెండా ఊపడంతో ప్రాంతీయ రై తాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రిజర్వాయర్ నిర్మాణంపై కేవలం సర్వేలకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి.

2015లో తొలి సర్వే: 

మొదట 20 టీఎంసీల సామర్థ్యంతో వీరన్నపేట, పెద్ద ఎల్కిచర్ల, జిల్లేడు, లాల్పహాడ్ గ్రామాల మీదుగా సర్వే చేశారు. ఆ తర్వాత సామర్థ్యాన్ని 12 టీఎంసీలకు కుదిస్తూ లక్ష్మీదేవిపల్లి, ఎల్కగూడ, పద్మారం పరిసరాల్లో సర్వే సాగింది.మూడోసారి కేవలం 5 టీఎంసీల సామర్థ్యానికే సర్వేను పరిమితం చేశా రు. 2018 ఎన్నికల ప్రచారంలో అప్పటి సీ ఎం కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకుని మరీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూ ర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

విపక్షాల పోరాటాలు ప్రజా ఉద్యమాలు..

ఈ ప్రాజెక్టు జాప్యంపై గతంలో పెద్ద ఎత్తున రాజకీయ, ప్రజా ఉద్యమాలు నడిచాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రాజెక్టు ప్రాధాన్యతను ఎత్తిచూపారు. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు గతం లో ప్రతి పక్ష పార్టీల నేతలు వైఎస్ షర్మిల, ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ వంటి ప్రముఖులెందరో ఇక్కడికి వచ్చి ఉద్యమాలకు మద్దతు తెలిపారు.

’పాలమూరు అధ్యయన వేదిక’ సైతం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూనే వచ్చింది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను నిరంతరం ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చే యాలని ఆదేశిస్తూ.. భూసేకరణకు అవసరమైన నిధులను, పరిపాలనా అను మతుల ను తక్షణమే మంజూరు చేశారు. రిజర్వాయ ర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 266.65 కోట్లు కేటాయించింది.

మూడు ప్యాకేజీలు.. 2,919 ఎకరాల భూసేకరణ..

ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా (19, 20, 21) విభజించి భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది.

(ప్యాకేజీ 19 ): ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 32 కి.మీ. కాల్వ (సొరంగాలు, ఓపెన్ కెనాల్స్)1,355 ఎకరాలు వికారాబాద్ జిల్లా సైదుపల్లి (903 ఎక), కుల్కచర్ల అల్లాపూర్ (343 ఎకరాలు), పద్మారం (266 ఎకరాలు)

(ప్యాకేజీ 20) పంప్హౌస్ నిర్మాణం52 ఎకరాలు రంగారెడ్డి జిల్లా పద్మారం,

(ప్యాకేజీ 21) రిజర్వాయర్ కట్ట (బండ్ ) నిర్మాణం1,512 ఎకరాలుజిల్లేడు చౌదరిగూడ మండల పరిధి లో కి వస్తాయి.

రైతులో హర్షం: 

బోరు బావుల కింద పెట్టుబడులు పెట్టి, భూగర్భ జలాలు అడుగంటి ఏటా నష్టపోతున్న షాద్నగర్, పరిగి నియోజకవర్గాల రైతులకు ఈ ప్రాజెక్టు ఒక సంజీవని లాంటిది. 2.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్ పూర్తయితే దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ఈ ప్రాంత తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. ప్రభుత్వ తాజా చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మొత్తం సేకరించే భూమి: 

2,919 ఎకరాలు

ఎకరాకు నష్టపరిహారం: 

రూ. 12 లక్షలు

మొత్తం అంచనా వ్యయం 

(పరిహారం): రూ. 350.84 కోట్లు

తుది నీటి సామర్థ్యం:

2.9 టీఎంసీలు

లబ్ధి పొందే ఆయకట్టు: 

సుమారు 4 లక్షల ఎకరాలు...