27 June, 2026 | 2:32 AM

19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం..

27-06-2026 01:23 AM

290 మంది పట్టాదారుల రిలే నిరాహార దీక్ష

మొయినాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన 60 గజాల ఇంటి స్థలాల్లో గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ మండలంలోని హిమాయత్నగర్కు చెందిన 290 మంది పేద పట్టాదా రులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.

సంఘం నాయకులు మాట్లాడు తూ, 2007లో చేవెళ్ల ఆర్డీవో ఉత్తర్వుల మేర కు 290 మంది పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 60 గజాల ఇంటి స్థల పట్టాలు మం జూరయ్యాయని తెలిపారు. అనంతరం ఆ భూమిపై రహదారి హక్కుకు సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో గత 19 ఏళ్లుగా గృహ నిర్మాణానికి అనుమతి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 2023లో అదే ప్రాంతంలో ‘కేసీఆర్ కాలనీ‘ పేరుతో శంకుస్థాపన నిర్వహించి పట్టాదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ఇటీవల సంబంధిత భూమిని మార్కెట్ అవసరాల కోసం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం రా వడంతో 290 మంది పట్టాదారుల భవిష్య త్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి 2007లో మంజూరైన పట్టాల ప్రకారం అదే స్థలంలో గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, లేదా ప్రత్యామ్నాయంగా తగిన స్థలం కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ రిలే నిరాహార దీక్షలో హిమాయత్నగర్ వార్డు-4 సంఘాల అధ్యక్షులు కట్టమీది శ్రీను, కుమ్మరి విట్టల్, కరీం, గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు షాబాద్ సాయి, సురేష్, వడ్ల కలిదాస్ చారి, రేడిపల్లి సుమన్, షాబాద్ నాగరాజు, షాబాద్ ప్రవీణ్, కట్టమీది రాజేందర్, షాబాద్ సందీప్, కట్టమీది రాకేష్, మాల స్వామి, కొమ్ము శ్రీకాంత్, సలీం ఖాన్, కుమ్మరి దర్శన్ తదితరులు పాల్గొని ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని కోరారు.