19-09-2025 07:55:55 PM
ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహమ్మద్ సలీం
కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఆవాస్ యోజన సమాచారం త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపిడిఓ మహమ్మద్ సలిం అన్నారు. మండలంలోని వర్షకొండ గ్రామంలో ఆవాస్ యోజన సమాచారాన్ని ఆన్లైన్ నందు నమోదు చేస్తున్న వివరాలను శుక్రవారం ఎంపీడీవో మహ్మద్ సలీం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో రెండు రోజులలోగా ఆవాస్ యోజన ఆన్లైన్ నందు సంబంధిత సమాచారాన్ని పొందుపరచాలని పంచాయతీ కార్యదర్శిలకు ఎంపిడిఓ సుచించారు.