23 May, 2026 | 4:49 PM

ఎస్ఐ బి.రాజేష్ కుమార్ ను సత్కరించిన దమ్మపేట పంచాయతీ పాలక వర్గ సభ్యులు

23-05-2026 03:48 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా బి. రాజేష్ కుమార్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దమ్మపేట పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యుల బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్సై రాజేష్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ​

ఈ సందర్భంగా ఎస్సై బి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని,  ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో సేవలందిస్తామని, మండలంలో శాంతియుత వాతావరణానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ​