రైతులను నిలువునా దోస్తున కాంగ్రెస్ సర్కార్
బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆరోపణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలోనే రైతులను నిలువునా దోస్తునారని సుల్తానాబాద్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, నాయకులు ఆనుమాల బాపూరావు, మైలారం నారాయణలు ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రైతులను ఆదుకుంటున్నామని గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని
ఆధారాలతో సహా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఇది వారికి మంచి పద్ధతి కాదని అన్నారు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ దాసరి మనోహర్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైనది కాదని, అభివృద్ధి ప్రదాత మనోహర్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. సర్పంచ్ గా అన్నయ్య గౌడ్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తి అని కేవలం ఎమ్మెల్యే మెప్పుకోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ప్రజలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. మచ్చలేని నాయకుడు దాసరి మనోహర్ రెడ్డి పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.






