28 June, 2026 | 3:42 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

ఐఎన్‌టీయూసీ 327 యూనియన్‌లో చేరిన దానం

01-12-2025 02:03 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 30, (విజయక్రాంతి):INTUC అను బంధ విద్యుత్తు కార్మిక సంఘం  తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 లో దానం నరసింహరావు ఆదివారం చేరారు. హన్మకొండలోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ఆధ్వర్యంలో దానం నరసింహారావు చేరారు. ఆయన కేటీపీఎస్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యకులు, ప్రస్తుత డైరెక్టర్ గా ఉన్నారు.

1535 యూనియన్ జెన్కో ఆర్గనైజ్ సెక్రెటరీ గా ఉన్నారు. ఆ యూనియన్ కు రాజీనామా చేసి 327 లో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ దానంకు కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జెన్కో ప్రెసిడెంట్ పిన్నింటి మాధవరావు గారు, జన్కో సెక్రటరీ సిహెచ్ సాయిబాబు , జిల్లా లేబర్ సెల్ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం సాదం రామకృష్ణారావు, జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్ పాల్గొన్నారు.