ప్రమాదకరంగా ప్రధాన రహదారి
ఖమ్మంపల్లి-అడవి శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మూల మలుపులు
పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు
రహదారిపై ప్రయాణికులకు పొంచి ఉన్న ప్రమాదం
ముత్తారం మార్చి04 (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి- అడవి శ్రీరాంపూర్ ప్రధాన రహదారి ని ర్మాణం పనులు ప్రమాదకరంగా జరుగుతున్నాయి. ప్రధాన రహదారి నిర్మాణంలో మూలమలుపుల వద్ద రోడ్డును వెడల్పు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాధాన రహదారి నిర్మాణం ఇరుకు రోడ్డు లాగా మారిపోతుంది. దీంతో ప్రభు త్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డబు ల్ రోడ్డు పనులు చేయడం ఎందుకని ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నిస్తున్నారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న రహదారిపై ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉన్నదని ఈ ఫోటోలు చూ స్తేనే కనిపిస్తుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ఖమ్మంపల్లి మానేరు బ్రిడ్జి నుంచి అడవి శ్రీరాంపూర్, ఓడేడు గ్రామాల వరకు దాదాపు రూ. 30 కోట్లు నిధులు మంజూరు చేసి మండల ప్రజల సౌకర్యంగా డబుల్ రోడ్డు మంజూరు చేయగా రోడ్డు మధ్యలో మూలమలుపు వద్ద సైడ్ వాల్ నిర్మించకపోవడంతో వాహనాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని కనిపిస్తుంది.
అలాగే అడివి శ్రీరాంపూర్ లోని అమరాబాద్ కట్ట కిందికి దిగే వద్ద ఉన్న మూల మలుపును వెడల్పు చేయకపోవడంతో అక్కడ కూడా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవ కాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ప్రధాన రహదారులను సదరు అధికారులు ప్రజల సౌకర్యార్థం వెడల్పు చేసి నిర్మించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.




