5 March, 2026 | 7:24 AM

గల్ఫ్‌లో మనోళ్లు..!

05-03-2026 12:37 AM

* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుటుంబాల ఆందోళన

* ఫోన్ కాల్స్ కోసం వేచి చూసే కన్నీటి కళ్ల జంటలు

కోరుట్ల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మధ్యప్రాచ్యంలో మళ్లీ మంటలు రేగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు, వాటిలోకి దిగిన అమెరికా పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. ఈ యుద్ధ దుమారం ప్రభావం గల్ఫ్ దేశాలపై పడుతుండగా, అక్కడ ఉపాధి కోసం ఉన్న వేలాది తెలుగు కార్మికుల కుటుంబాలు ఉమ్మడి క రీంనగర్ జిల్లాలో క్షణక్షణం భయంతో గడుపుతున్నాయి. రాత్రంతా మొబైల్ ఫోన్ చేతి లో పట్టుకుని మా వాళ్లు క్షేమంగానే ఉన్నా రా? అన్న ఒక్క ప్రశ్నతో కుటుంబాలు ఆగమాగమవుతున్నాయి.

యుద్ధ మేఘాల కింద గల్ఫ్ గందరగోళం

ఇటీవలి దాడులు, ప్రతిదాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఉద్రిక్తతలతో ఉక్కిరిబి క్కిరవుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు భౌగోళికంగా సమీపంలో ఉండటం తో అప్రమత్త స్థితిలోకి వెళ్లాయి. కొన్నిచోట్ల విమాన సర్వీసులు నిలిచిపోవడం, భద్రతా ఆంక్షలు కఠినతరం కావడం, కమ్యూనికేషన్ అంతరాయాలు ఏర్పడటం వలస కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యుద్ధ దృ శ్యాలు గ్రామాల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి.

-వలస కుటుంబాల్లో ఆందోళనల వలయం

జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వే ములవాడ, ధర్మపురి ప్రాంతాలకు గల్ఫ్ వలసలతో మూడు దశాబ్దాల అనుబంధం ఉం ది. నిర్మాణ రంగం, డ్రైవింగ్, హౌస్మేడ్ ప ను లు వంటి ఉపాధుల్లో వేలాది మంది పని చేస్తున్నారు. కుటుంబాల జీవనాధారం ప్ర ధానంగా రిమిటెన్స్పైనే ఆధారపడి ఉంది. నె లకు వచ్చే డబ్బుతో పిల్లల చదువు, రుణాల చెల్లింపులు, కుటుంబ ఖర్చులు సాగుతున్నా యి. రోజూ మూడుసార్లు ఫోన్ చేస్తున్నాం.

ఒక్కసారి లైన్ పడకపోతే గుండెల్లో దడ మొ దలవుతోంది అని కోరుట్ల మండలానికి చెం దిన ఓ మహిళ కన్నీటి స్వరంతో చెబుతోంది. కోరుట్ల పట్టణంలో ఒక వృద్ధ తల్లి తన కు మారుడు రియాధ్లో క్షేమంగా ఉన్నాడని చెప్పిన వీడియో కాల్ ఒక్కటే ఆధారంగా ఊపిరి పీలుస్తోంది. కానీ సిగ్నల్ తెగిపోతే మళ్లీ ఆందోళనే. కార్మికుల ఉద్యోగాలపై కూ డా భయం వ్యక్తమవుతోంది. రిమిటెన్స్ ఆ లస్యం అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన స్పష్టంగా కనిపి స్తోంది. డబ్బు రాకపోతే పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలి? అని ఒక తల్లి ప్రశ్నిస్తోంది.

భారత ప్రభుత్వ చర్యలు అప్రమత్తతలో యంత్రాంగం

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర విదేశాంగ శాఖ 24 గంటల హెల్ప్లైన్లు ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల క్షేమ సమాచారం సేకరించేందుకు దౌత్య కా ర్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయి. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలిం పు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కుటుంబాలకు సమాచారం అందిస్తోంది.

గ్రామాల్లో ప్రార్థనలు 

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో గ్రామాల్లో ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. కుటుంబాలు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ రోజులు గడుపుతున్నాయి. మా వాళ్లు క్షేమంగా ఇంటికి చేరాలి అన్న ఆశ ఒక్కటే అందరి మనసుల్లో ఉంది.యుద్ధ మేఘాలు ఎంతకాలం కమ్ముకుంటాయో తెలియదు. కానీ గల్ఫ్లోని ప్రతి తెలుగు కార్మికుడి వెనుక ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక ఆశ ఉంది. ఈ సంక్షోభం త్వరగా ముగిసి ప్రశాంతత నెలకొనాలని గల్ఫ్ కార్మికుల కుటుంబాలు  ప్రజలు ప్రార్థిస్తున్నారు.