15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

15-12-2025 06:57 PM

కరెంటు తీగలను అల్లుకున్న తీగ మొక్కలు, కంపచెట్లు..

చండూరు (విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోని 9వ వార్డులో కరెంటు తీగల చుట్టూ తీగ జాతి మొక్కలు, గుబురుగా పెరిగిన కంపచెట్లతో ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులు వీచినప్పుడు విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాపిడి జరిపి నిప్పురవ్వలు చెలరేగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వర్షం వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కరెంటు తీగలకు వేలాడుతున్న పిచ్చి తీగలు కరెంటు వైర్ల చుట్టూ అల్లుకున్నాయి.

వర్షం వస్తుందంటే చిన్నపిల్లలు ఆ చెట్ల దగ్గరకు పోతే ఏమవుతుందోనని ఆ కాలనీవాసులు బేబిలెత్తుతున్నారు. కాలనీల మధ్యలో కరెంటు తీగలు తీగ మొక్కలతో గుబురుగా పెరిగిన కంప చెట్లతో కరెంటు తీగలు మూసుకపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు తీగలకు అల్లుకున్న తీగ మొక్కలను, కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు.