డేంజర్ రోడ్డు.. నిత్యం ప్రమాదాలు!
-గత మూడేళ్లలో 137 మంది మృతి
-నత్త నడకన హైదరాద్ జాతీయ రహదారి విస్తరణ పనులు?
రంగారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): హైదరాద్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 163) నిత్యం ప్రమాదాలకు నిలయ గా మారింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అప్ప జంక్షన్ మొదలుకొని వికారాబా ద్ జిల్లా వరకు దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు ప్రధాన రోడ్డుపై మూలమలుపులు, ఇరువైపులా మర్రి చెట్లు, ఇరుకు రోడ్లు ఉండ టం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది.
ఈ దారిలోనే రోజూ కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. గత నాలుగేళ్లలో ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో దాదాపు 137 మందికి మృతి చెందగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.
ఆది నుంచి అడ్డంకులే..
బీజాపూర్ నాలుగు లైన్ల జాతీయ రహదారి 2017లో మంజూరయ్యింది. కానీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కేసు వల్ల ఈ రహదారి పనులు ఆగిపోయాయి. స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్డును కేంద్రం 2018లో ఎన్‌హె 163గా అప్‌గ్రేడ్ చేసి రూ.928.41 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం 1956 కింద 2018 జూలై, 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
వీటి ప్రకారం సర్వే చేసిన అధికారులు కొత్త అలైన్ మెంట్ కు అవకాశం ఉన్నా.. పాత మార్గాన్ని విస్తరించేందుకే మొగ్గు చూపారు. ఈ మార్గంలో 900 మర్రి చెట్లతో పాటు వేల సంఖ్యలో ఇతర చెట్లు పోతుండడంతో 2021లో ‘సేవ్ బనియన్స్’ సంస్థ ఎన్‌జీటీలో కేసు వేసింది. దీంతో టీజీపీఏ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయా యి. 2023లో నవంబర్‌లో ఎన్‌జీటీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంతో పాటు ఈఐఏ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఈ మేరకు ఎన్‌హెఏఐ 2024 జనవ రి 2న ఈఐఏ నోటిఫికేషన్ ఇచ్చి.. ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, క్లుమైట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఫిబ్రవరి 2న టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) పొందింది. దీని ఆధారంగా సైట్ విజిట్ కోసం ఉప-కమిటీ ఏర్పాటైంది. వీళ్లు ఇచ్చిన ఈఐఏ నివేదికను జూన్ 22న ఈఏసీ ఆమోదించగా.. దీన్ని ‘సేవ్ బనియన్’ సంస్థ ఎన్‌జీటీలో సవాల్ చేసింది.
ఈఐఏ నివేదికలో లోపాలు
అదనపు భూసేకరణ అవసరం లేనందు న పబ్లిక్ హియరింగ్‌ను మినహాయించడా న్ని తప్పు పట్టిన ఎన్జీటీ.. భూసేకరణ చేశామని ఎన్‌హెఏఐ అధికారులే ఒప్పుకున్నారని గుర్తుచేసింది. 900 మర్రి చెట్లలో 522 చెట్ల ను తరలిస్తామని, బైపాసులు, రోడ్డు వెడల్పు తగ్గించడం ద్వారా 393 చెట్లను కాపాడతామని ఎన్‌హెఏఐ పేర్కొన్నప్పటికీ.. కేవలం 6 చెట్లు మాత్రమే తరలించడానికి అనువైనవని ‘సేవ్ బనియన్స్’ సంస్థ వాదనను సమర్థించింది. 5.8 కిలోమీటర్ల మేర ఉన్న చెట్ల వరుసలు తరలించడం అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తించింది. 84కు పైగా పక్షి జాతులు ఉన్నాయ ని.. హెరాన్రీ చెట్లను గుర్తించకపోవడం, జెడ్‌ఎస్‌ఐ నివేదిక లేకుండానే ఈఏసీ.. ఈఐఏను ఆమోదించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఉంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.






