calender_icon.png 23 June, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి వాహనాల పక్క నుంచి వెళ్లడం ప్రమాదకరమే

22-06-2025 08:13:06 PM

మేడ్చల్ అర్బన్: నిత్యం రోడ్డుపై ప్రయాణించేప్పుడు, నడుచుకుంటూ వెళ్లే సమయంలో వాటర్ ట్యాంకర్లు రోడ్డుపై కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు రోడ్డుపై  నీటి సరఫరా ట్యాంకర్లు వెళ్తుంటే వాటి పక్కనుండి వాహనాన్ని నడపడం కాస్త ప్రమాదకరమేనని చెప్పవచ్చు. అంతేకాకుండా రోడ్డుపై నడిచే సమయంలో పక్కనుండి వాటర్ ట్యాంకర్లు వెళ్ళినప్పుడు పాదాచారులు కాస్త అప్రమత్తతతో ఉండి రోడ్డుపై వెళ్లే వాటర్ ట్యాంకర్ కు దూరంగా ఉంటే బెటర్. గతంలో ఇలా వాటర్ ట్యాంకర్ కుప్పకూలి పాదాచారులు, వాహనదారులు ప్రమాదం బారిన పడి మృతి చెందిన సంఘటనలు లేకపోలేవు.