24 August, 2026 | 3:59 AM

జిల్లా స్థాయి యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్ పోటీలు

24-08-2026 02:49 AM

మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 23: మంచిర్యాల జిల్లా యోగాసన స్పోరట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ మంచిర్యాల జిల్లా స్థాయి యోగాసన క్రీడా ఛాంపియన్ షిప్  2026 పోటీలు ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఈ ఛాంపియన్ షిప్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని, ట్రెడిషనల్ ఇండివిడ్యువల్, ఆర్టిస్టిక్ సింగిల్, రిథమిక్ పెయిర్ తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులకు మంచిర్యాల జిల్లా యోగాసన స్పోరట్స్ అసోసియేషన్ (ఎం డీ వై ఎస్ ) అధ్యక్షులు అక్కల తిరుపతి వర్మ, సెక్రటరీ,  ప్రధాన కార్యదర్శి మండ శ్రీనివాస్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు.

విజేతలు వీరే...

సబ్ జూనియర్ బాలురు ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో మాతూరి అనిరూప్ ( గోల్ మెడల్),  వెల్ది ధనుష్ (సిల్వర్ మెడల్), జనగామ అశ్వధ్ కుమార్ (బ్రాంజ్ మెడల్) సాధించారు. ఆర్టిస్టిక్ సింగిల్ లో బుర్ల సాయితేజ ( గోల్ మెడల్), సబ్ జూనియర్ బాలికలు ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో డి. ఖుషి (గోల్ మెడల్), శ్రుతి కుంచలహే (సిల్వర్ మెడల్), నవునూరి వేదాంశి (బ్రాంజ్ మెడల్), అదనపు ఫలితాలలో చైత్ర గోల్ మెడల్, సమీక్ష సిల్వర్ మెడల్ సాధించారు. రిథమిక్ పెయిర్ లో తూటి అహల్య, కోడి మహతి గోల్ మెడల్, జూనియర్ బాలురు ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో ఎం. సాయితేజ గోల్ మెడల్, మొహమ్మద్ ఫరూఖ్ సిల్వర్ మెడల్, అథ్రం జై కృష్ణ సాయి బ్రాంజ్ మెడల్ సాధించారు.

జూనియర్ బాలికలు ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో చించవత్ వర్ణిత శ్రీ  గోల్ మెడల్, జాది అంకిత సిల్వర్ మెడల్, సీనియర్ బాలికలు   (సీనియర్ ఏ ) ట్రెడిషనల్ లో పుట్ట ప్రేమలత గోల్ మెడల్, సీనియర్ సీ ట్రెడిషనల్ లో పరిపెల్లి రేఖ గోల్ మెడల్, ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో వైష్ణవి  గోల్ మెడల్, శ్రీజ సిల్వర్ మెడల్, విష్ణుప్రియ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆర్టిస్టిక్ సింగిల్ లో శ్రీజ గోల్ మెడల్, వైష్ణవి సిల్వర్ మెడల్, సీనియర్ బాలురు ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ లో అర్షద్ గోల్ మెడల్, ఆర్టిస్టిక్ సింగిల్ లో రాహుల్ గోల్ మెడల్ లు సాధించారు.