14 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్

14-05-2026 03:11 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని గోయేగాం గ్రామం సమీపంలోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. వాంకిరి మండల నుంచి గోయేగాం సరిహద్దు వరకు ఉన్న రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించారు. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నేలకు ఆనుకొని ఉంది. దీంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అంటున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి ఫార్మర్ కు గద్దెను ఎత్తుగా నిర్మించి దానికి కంచ ఏర్పాటు చేసి అమ్మర్చాలని స్థానికులు కోరుతున్నారు.