ఏఐయు కె ఎస్ జాతీయ కమిటీ కార్యవర్గ సభ్యునిగా నందిరామయ్య
14-05-2026 03:12 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ కార్యవర్గ సభ్యునిగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన నందిరామయ్య ఎంపికైనట్లు ఆ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వా గ్మారే మహేందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన నందిరామయ్య గురించి మాట్లాడుతూ రామయ్య గత 40 ఏళ్లుగా రైతుల పక్షంగా అలుపెరుగని పోరాటాలు ,ఉద్యమాలు చేసి ,ఆదివాసీ గిరిజన ప్రజల కోసం భూ పోరాటాలు, పోలీస్ కేసులు, జైలు జీవితాన్ని అనుభవించి ప్రజల కోసం పోరాటం చేశాడని ఇది గమనించిన సంఘం ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు పట్టణంలో జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభలో ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్లు ప్రకటనలో తెలిపారు.






