3 July, 2026 | 10:21 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్

03-07-2026 09:47 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్ నియామకాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న దారావత్ వీరన్న నాయక్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.

గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దారావత్ వీరన్న నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.