27 August, 2026 | 2:15 PM

Breaking News

బాసర ఆలయంలో దర్శనాలు బంద్!

05-07-2026 12:00 AM
  1. నేటి నుంచి బాలాలయంలో అమ్మవారి దర్శనం
  2. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ నేపథ్యంలో నిర్ణయం

నిర్మల్, జూలై 4 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్న నేపథ్యంలో బాసర పురాతన గుడిలో ఆదివారం నుంచి దర్శనాలను నిలిపివేశారు. ఆగమశా స్త్రం ప్రకారం వేద పండితుల సూచనల మేరకు పురాతన ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూనే భక్తుల కోసం సరస్వతి మాతను బాల ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు.

బాసరలోని 150 అక్షరాభ్యాస మండపంలో అమ్మవారి ప్రతిమను నిలిపి ప్రతిరోజు పూజలు అక్షరాభ్యాసాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి రూ. 225 కోట్లు కేటాయించి బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆ పనులకు శంకుస్థాపన చేశారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్న నేపథ్యంలో సరస్వతి మాత బాల ఆలయంలోని ఆదివారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.