బళ్లారి జైలుకు దర్శన్
28-08-2024 01:29 AM
- జైలులో జల్సా చేస్తున్న ఫొటో వైరల్ కావడంతో చర్యలు
- బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు తరలింపు
బెంగళూరు, ఆగస్టు 27: అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆయనకు రాచమర్యాదలు లభిస్తున్నాయని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించినట్లు సమాచారం. దర్శన్ జైలులోని బ్యారక్ నుంచి బయటకు వచ్చి ఓ రౌడీ షీటర్‌తో పాటు స్నేహితులతో కలిసి కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అనంతరం వీడియోకాల్ ద్వారా తన స్నేహితునితో మాట్లాడినట్లు ఓ వీడియో సైతం బయటికి వచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులపైనా ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసిన విష యం తెలిసిందే.




