దొనూర్ గ్రామ సర్పంచ్‌గా దాసరి పురుషోత్తం ఏకగ్రీవం
ఉన్నత విద్యావంతునికి ఏకగ్రీవ పట్టం కట్టిన గ్రామప్రజలు!
ధర్మపురి,డిసెంబర్ 11(విజయక్రాంతి): ధర్మపురి మండలం దొనూర్ గ్రామసర్పంచ్ గా దాసరి పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మపురిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒకటిగా 2002 భారీ ఓటర్లు కలిగి ఉన్నటువంటి దొనూర్ గ్రామపంచాయతీ గ్రామ ప్రజలు ఉన్నత ఉన్నత విద్యావంతుడైన దాసరి పురుషోత్తంకు ఏకగ్రీవంగా పట్టం కట్టడంపట్ల మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన దాసరి పురుషోత్తం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
సంక్షేమమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారధ్యములో రాజకీయ అరంగ్రేటం చేశారు. క్లిష్ట పరిస్థితుస్థుల్లో కాంగ్రెస్ పార్టీని విడవకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలుపులో భాగస్వామీలయ్యారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పురుషోత్తం సఫళీకృతుడయ్యారు. మంత్రి సహకారంతో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అని పురుషోత్తం ఆశాభావంవ్యక్తంచేశారు.




