బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
- పల్లెల అభివృద్ధి బీ.ఆర్.ఎస్ తోనే సాధ్యం
- అమలు కాని హామీలతో అధికార పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దు ఒంటెద్దు నరసింహారెడ్డి
గరిడేపల్లి, డిసెంబర్ 11 : బి.ఆర్.ఎస్ బలపరిచిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య ర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హుజూర్నగర్ బిఆర్‌ఎస్ నియోజక వర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి కోరా రు. గురువారం మండలంలోని కల్మలచెరువు, కీతవారిగూడెం గ్రామాల్లో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు, పింఛ న్లు, కళ్యాణ్ లక్ష్మి వంటి అనేక పథకాలతో పల్లెలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం అమలు కాని హామీలతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామాలకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సిపిఎం బలపరిచిన బిఆర్‌ఎస్ అభ్యర్థులు బొల్లెపల్లి రామనాథం, కలమలచెరువులో బచ్చలకూరి శ్రీను,ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
కీతవారిగూడెంలో బ్యాట్ గుర్తు పోస్టర్, నమూనా బ్యాలెట్ను ఆయన ఆవిష్కరించారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కేఎల్‌ఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ కీత జ్యోతి రామారావు, సిపిఎం నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీర రాఘవయ్య, బొల్లెపల్లి శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




