11 June, 2026 | 2:14 AM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా

11-06-2026 12:19 AM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..

సుల్తానాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1,13,14,15 వార్డులకు సంబంధించిన వార్డు సభ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు, బుధవారం జరిగిన ఈ సమావేశాల్లో విజయరమణ రావు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, నాళాలుఎప్పటికప్పుడుశుభపరచుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను త్వరలోనే వార్డు బాట పడతానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , మున్సిపల్ కమిషనర్ రమేష్, తహసీల్దార్ బషీరుద్దీన్ , కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.