రెండోరోజూ జమ్మూకశ్మీర్‌దే
రంజీ ట్రోఫీ ఫైనల్
హుబ్లీ, ఫిబ్రవరి 25 : కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపారు. తొలిరోజు పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆ జట్టు రెండోరోజూ అదే జోరును కొనసాగించింది. జమ్మూ ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు నమోదయ్యాయి. కర్ణాటక బౌలర్లు ఎంత శ్రమించినా ఆలౌట్ చేయలేకపోయారు. 284/2 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన జమ్ముకశ్మీర్ త్వరగానే సెంచరీ హీరో శుభమ్, అబ్జుల్ సమద్ వికెట్లు చేజార్టుకుంది.
అయితే కన్హియా వాదవాన్ (70) కర్ణాటక బౌలింగ్ను ఆటాడుకున్నాడు ఆట మరో గంటలో ముగుస్తుంద నగా పరా శ్రే యస్ గోపాల్ బౌల్ చేసి కర్ణాటకకు కాస్త ఊరటనిచ్చాడు. ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ 6 వికెట్లకు 527 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే ఫైనల్లో కర్ణాటక, జమ్ము కశ్మీర్ జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జమ్ము కెప్టెన్ పరా స్ డోగ్రా బ్యాటింగ్ చేస్తుండగా.. కర్ణాటక ఫీల్డర్ అనీశ్ స్లెడ్జింగ్ చేయడం మొదలెట్టాడు. ఓ దశలో పరాస్ తన సహనాన్ని కోల్పోయి హెల్మెట్ ధరించిన అనీశ్ తన తలతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు జోక్యం చేసుకుని సర్దిజెప్పారు. అయితే ఈ ఘటనపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. కెప్టెన్ పరాస్‌కు 50 శాతం జరిమానాను విధించింది.




