23 June, 2026 | 7:52 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

పాకిస్థాన్‌కు ఇక కష్టమే

26-02-2026 01:28 AM

కొలంబో, ఫిబ్రవరి 25: ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ మాత్రమే అధికారికంగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు రేసులో ఉన్నాయి. సూపర్ 8 గ్రూప్ 2లో మిగిలిన ఒక బెర్త్ కోసం న్యూజిలాండ్ రేసులో ముందుంది.

శ్రీలంకను ఓడించడం ద్వారా రన్‌రేట్‌ను బాగా మెరుగుపరుచుకుం ది. అదే సమయంలో కివీస్ విజయం పాక్ అవకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలవాల్సి ఉంటుంది. అది గెలిచినా మిగిలిన సమీకరణాలు కూడా కలిసి వస్తేనే పాక్ జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పాక్ జట్టు శ్రీలంక చేతిలో ఓడినా, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించినా పాక్ కథ ముగుస్తుంది.