23 June, 2026 | 10:10 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

హెచ్‌జీఏ జూనియర్ గోల్ఫ్ విజేత వివాన్

26-02-2026 01:24 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : హైదరాబాద్ యువ గోల్ఫర్ వివాన్ పిన్నప రెడ్డి మరోసారి మెరిసాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నిర్వహించి న ఫిబ్రవరి జూనియర్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. కేటగిరీ సిలో 79 గ్రాస్ పాయిం ట్లు సాధించి టైటిల్ గెలుచుకున్నాడు. ఏడేళ్లకే గోల్ఫ్ ఆడడం ప్రారంభించిన వివాన్ గత నాలుగేళ్లుగా పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటాడు.

2021 హెచ్‌జీఏ జూనియర్ ఓపెన్ కేటగిరీ ఈలో నూ, 2023 యంగ్ మాస్టర్స్ గోల్ఫ్ టూర్ లోనూ ఛాంపియన్ గా నిలిచాడు. 2022 హెచ్‌జీఏ జూనియర్ ఓపెన్ , 2024 హెచ్‌జీఏ సౌత్ జోన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్‌లో రన్నరప్ గా నిలిచిన విలాన్ చెన్నై వేదికగా జరిగిన మద్రాస్ జింఖానా గోల్ఫ్ టోర్నమెంట్‌లో సెకండ్ రన్నరప్‌గా  నిలిచాడు. ఇప్పటి వర కూ మూడు స్టేట్ లెవెల్ టోర్నీల్లో విజేతగానూ, 9 సార్లు రన్నరప్‌గానూ నిలిచాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ జూనియర్ టో ర్నీల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు.