4 రోజులు వానలు
10-06-2025 01:17 AM
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ద్రోణి ప్రభావంతో రాష్ట్రం లోని పలు జిల్లాల్లో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మం గళవారం ఉమ్మడి ఖమ్మం, నల్లగొం డ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబా బాద్ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తూ ఓ మోస్తరు వర్షాలు కు రిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో వర్షా లు కురుస్తాయని తెలిపింది.






