17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చురుగ్గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

10-06-2025 01:16 AM

రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని  గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు.

ఈ నెల 2వ తేదీ నుంచి ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు రూ. 22.64 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి రాష్ర్టంలో ఇప్పటివరకు  9,877 ఇండ్లు బేస్‌మెంట్ పూర్తి కాగా, 1839 ఇండ్లు గోడల వరకు, మరో 388 ఇండ్లు శ్లాబు పనులు పూర్తయినట్లు తెలిపారు.

వీటికి మొత్తం  రూ .98.64 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. లబ్దిదారులు తమ స్ధలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యం కల్పించామన్నారు.