నూతన మంత్రులను కలిసిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
09-06-2025 07:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు(District Congress Party President Kuchadi Srihari Rao) సోమవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కోసం పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ లు కృషి చేస్తున్నారని అన్నారు.






