6 July, 2026 | 1:10 PM

Breaking News

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •  

చరిత్ర తిరగరాసింది బిజెపి ప్రభుత్వం

09-06-2025 07:38 PM

- నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యం 

- గడిచిన 11యేండ్లలో చరిత్ర స్మరించుకునేలా పరిపాలన 

- కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చిన బిజెపి నాయకులు రఘురాం గౌడ్..

హన్వాడ: దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసి ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) సారాధ్యంలో చరిత్రలో నిలిచిపోయే వినూత్న మార్పులు తీసుకురావడం జరిగిందని బిజెపి మండల నాయకులు రఘురాం గౌడ్(BJP Mandal Leader Raghuram Goud) అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్‌ భారత్‌కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

బిజెపి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల సమగ్ర పురోగతిపై దృష్టి సారించారని తెలిపారు. ఆర్టికల్ 370, 35A, ముఖ్యంగా ముస్లిం మహిళా సోదరీమణుల కొరకు త్రిబుల్ తలాక్, CAA, NRC Muslim Waqf Board అనేకమైన విప్లమాత్మకమైన బిల్లులను పార్లమెంట్ లో ఆమోదం చేసి అమలు చేయడం జరుగుతుందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు, సమిష్టి భాగస్వామ్యంతో, భారతదేశం విభిన్న రంగాలలో వేగవంతమైన మార్పులను ప్రజల ముంగిట ఉంచిందని చెప్పారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు అభివృద్ధి వైపు పరుగులు తీయాలని సంకల్పాన్ని ప్రజలకు అందిస్తూ బిజెపి ప్రభుత్వం అందరి మన్ననలు పొందుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే నిరంతరం శ్రమిస్తున్న బిజెపి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.