09-06-2025 07:45:03 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లను కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం మైనారిటీ నాయకులు ఎండీ రహీం షరీఫ్(Constituency Minority Leaders MD Rahim Sharif) హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సామాజిక వర్గాలకు మంత్రి పదవులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.