29 April, 2026 | 9:54 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిసిసి ఉపాధ్యక్షులు చొప్పరి

18-06-2025 09:40 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెల్కల కాంతయ్య ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం(Former ZPTC Choppari Sadanandam) పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి, మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని నివాళులర్పించారు. ఆయన వెంట పోతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్ర మల్లయ్య, ఎంపీటీసీలు చెల్కల సుధీర్, బండ సమ్మయ్య, చెల్కల ఓదేలు, నరేందర్, కిషన్, బత్తుల రాజయ్య, మల్లయ్య, నాంసాని రమేష్, మొగిలి, అనిల్, గట్టయ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.