2 September, 2026 | 10:40 AM

ఎంపీడీవో శంకర్ సేవలు అభినందనీయం

02-09-2026 | 09:59am

– జెడ్పీ సీఈవో జానకీరామ్

హత్నూర: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని జెడ్పీ సీఈవో జానకీరామ్ అన్నారు. మంగళవారం హత్నూర ఎంపీడీవోగా పదవీ విరమణ చేసిన శంకర్‌కు వీఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జానకీరామ్, డీపీవో మల్లారెడ్డి, అదనపు డీఆర్‌డీవో బాలరాజ్ తదితరులు శంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. శంకర్ మృదుస్వభావంతో సహచరులతో కలిసిమెలిసి పనిచేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం శంకర్ దంపతులు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.