26 May, 2026 | 1:36 AM

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ

26-05-2026 12:50 AM

తలకొండపల్లి, మే25, (విజయక్రాంతి): తలకొండపల్లి పోలీస్ స్టేషన్ను మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, కేసుల నమోదులు, పెండింగ్ కేసుల వివరాలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ విధానంపై మరియు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా  శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి  పెట్టాలని సూచించారు.

మహిళల ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా క్రమశిక్షణతో సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ ఎస్. జానకి రెడ్డి, ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి, ఎస్‌ఐ కె. శేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.