25 July, 2026 | 1:47 AM

సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీసీపీ రామ్ రెడ్డి

25-07-2026 12:00 AM

సుల్తానాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తా నాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వా ర్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి డీసీ పీ బి.రామ్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు.

గ్రేవ్ కేసులు, ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి,వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించేలా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. అనంతరం డీసీపీ పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీలలో పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్త్స్ర చంద్రకుమార్ , సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐ లు పాల్గొన్నారు.