సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సత్తుపల్లి. జూలై 24. ( విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి , సత్తుపల్లి రూరల్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎం రిలీఫ్ ఫండ్) ,కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను శుక్రవారం ఆమె పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద 37 మంది లబ్ధిదారులకు రూ.16,18,900 విలువైన చెక్కులను, కళ్యాణ లక్ష్మి పథకం కింద 71 మంది లబ్ధిదారులకు రూ.71,08,236 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ, సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రెహనా బేగం కమల్ పాషా, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ ఆనంద్ బాబు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.






