calender_icon.png 9 January, 2026 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త కమీషనరేట్లకు డీసీపీలు

08-01-2026 01:41:09 AM

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖలో పాలనా పరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నా యి. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్‌పల్లి డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్, హైదరాబాద్ ఎస్‌బీ జాయింట్ సీపీగా విజయ్‌కుమార్, హైదరాబాద్ సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్‌గా తఫ్సీర్,

హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా శ్వేత, కుత్బుల్లాపూర్ డీసీపీగా కోటిరెడ్డి, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి, సికిందరాబాద్ డీసీపీగా రక్షితామూర్తి,చార్మినార్ డీసీపీగా కిరణ్‌ఖరే, ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ, ఖైరతాబాద్ డీపీగా శిల్పవల్లి,గోల్కోండ డీసీపీగా చంద్రమోహన్, జూబ్లీహిల్స్ డీసీపీగా రమణారెడ్డి, శంషాబాద్ డీసీపీగా రాజేశ్, షాద్‌నగర్ డీసీపీగా శిరీష నియమితులయ్యారు.