calender_icon.png 9 January, 2026 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

08-01-2026 01:40:51 AM

  1. పారదర్శకంగా పంపిణీ చేస్తాం
  2. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి 

హుజూర్ నగర్, జనవరి 7(విజయక్రాంతి): రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మం త్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం హుజూ ర్‌నగర్ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రులు మాట్లాడారు. రామస్వామి గుట్టవద్ద 115 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న 2,160 ఇం డ్లను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతామన్నారు.

పేదలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మా ణంలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేసి నిరుపేదలకు అందించాలన్న తన బలమైన ఆకాంక్ష నేరవేర బోతు న్నం దుకు మహదానందంగా ఉందన్నారు.    మోడల్ కాలనీకి పాఠశాల, అంగన్ వాడీ కేంద్రంతో పాటు కమ్యూనిటీ హల్,క్రీడా ప్రాంగణం మం జూరు చేశామని అన్నారు.

అనంతరం పట్టణంలోని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను మంత్రి ఉత్తమ్ సందర్శించి శిక్షణ పొందుతున్న 172 మంది విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. అలాగే పట్టణంలోని మం డల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాలకు సంబంధించి 1 కోటి 71 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, హౌసింగ్ ఎండీ గౌత మ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ కొత్తపల్లి నర్సింహా, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చెర్మన్ రాధికా అరుణ్ కుమార్, తహసీల్దార్ కవిత, సీఐ చరమందరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, యరగాని నాగన్న, గూడెపు శ్రీను, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి, అజిజ్ పాషా, సైదా, వల్లపుదాసు కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.