calender_icon.png 9 January, 2026 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడొద్దు

08-01-2026 01:42:49 AM

జీహెచ్‌ఎంసీ నూతన అధికారులకు దిశానిర్దేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని ఈ విషయంలో అధికారులెవరూ రాజీపడకూడదని నగరంలో నూతనంగా నియమితులై న జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య వ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించేందుకు బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధి లో ఉన్న భారీ యంత్రాంగం గురించి నూత న అధికారులకు వివరించారు. నగరంలో ప్రతిరోజూ సగటున 9,100 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, తలసరి వ్యర్థాల ఉత్పత్తి 680.59 గ్రాములుగా నమోదవుతున్నట్లు గణాంకాలతో సహా వివరించా రు. ఈ వ్యర్థాలను సకాలంలో తరలించడానికి శానిటేషన్ వర్కర్లు, స్వీపింగ్ గ్రూప్స్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, శాశ్వత పబ్లిక్ హెల్త్ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్వైజర్లతో కూడిన బలమైన కార్యాచరణ వ్యవస్థ అహర్నిశలు పనిచేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆరో గ్యం, పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీని పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కొత్త అధికారు లు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.