16 July, 2026 | 1:05 PM

లభ్యమైన ప్రేమ జంట మృతదేహాలు

06-06-2024 08:59 PM

సంగారెడ్డి: జిల్లాలోని న్యాల్‌కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీర నదిలో ఎట్టకేలకు ప్రేమ జంట మృతదేహాలు లభ్యమైయ్యాయి. గురువారం సాయంత్రం స్థానిక మంజీర నదిలో  కాకిజనవాడకు చెందిన బేగరి సదానందం, నారాయణఖేడ్ చాప్టాకే కస చెందిన సమీప బంధువులకు చెందిన మైనర్ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమ పెండ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో జూన్ 4వ తేదిన ఇంటి నుంచి వెళ్లి పోయారు. మంజీర నది బ్రిడ్జిపై బైక్, చెప్పులు, సెల్‌ఫోన్ వదిలిపెట్టి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం మంజీర నది తీరంలో హద్నూర్ పోలీసులు, కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టిన అచూకి లభించలేదు.

గురువారం సాయంత్రం మంజీర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి  ప్రేమ జంట మృతదేహాలు నదిలో తేలడంతో కుటుంబ సభ్యులకు, హద్నూర్ పోలీసులకు సమాచారాన్ని తెలపడంతో హుటహూటినా జహీరాబాద్ రూరల్ సీఐ నయిమోద్ధీన్, హద్నూర్ ఎస్‌ఐ రామనాయుడు సిబ్బందితో మంజీర నదికి చేరుకున్నారు. నదిలో తెలిన ప్రేమ జంట మృతదేహాలను బయటకు తీసి పోస్డుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కాగా ప్రేమ జంట మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ వారికి కంట తడిపెట్టించాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హద్నూర్ ఎస్‌ఐ రామానాయుడు పేర్కొన్నారు.