పటేల్ నగర్ లో భారీ అగ్నీప్రమాదం
06-06-2024 07:25 PM
హైదరాబాద్: నాంపల్లిలోని పటేల్ నగర్ లో గురువారం సాయంత్రం భారీ అగ్నీప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ ఫర్నీచర్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. చుట్టూ ఉన్న ఇళ్లలోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహయక చర్యలు చేపట్టి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






