రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు
09-03-2026 04:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో విప్లవ ఉద్యమకారుడు రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు. స్థానిక భగత్ సింగ్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బడుగుల హక్కుల కోసం ఆయన పోరాడారని సంఘం నాయకులు రాజన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బక్కన్న రామ్ లక్ష్మణ్ లక్ష్మి గంగన్న గఫూర్ మురళి తదితరులు పాల్గొన్నారు.




