7 August, 2026 | 4:45 PM

Breaking News

ఎర్ర కృష్ణారెడ్డి మరణం సీపీఎం పార్టీకి తీరని లోటు

07-08-2026 03:34 PM

మోతె, ఆగస్టు 7 (విజయక్రాంతి): సీపీఎం సీనియర్ నాయకులు ఎర్ర కృష్ణారెడ్డి(Erra Krishna Reddy) మరణం పార్టీకి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మోతె మండల కేంద్రానికి చెందిన సిపిఎం నాయకులు  ఎర్ర కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని సందర్శించి పార్థివ దేహంపై  అరుణ పతాకాన్ని కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లునాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ,  కృష్ణారెడ్డి తన మామ, దివంగత కమ్యూనిస్టు నాయకుడు ఎడమ చంద్రారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ జీవితాంతం సీపీఎం పార్టీ సభ్యుడిగా కొనసాగారని అన్నారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రమజీవుల హక్కుల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలు, పోరాటాల్లో ఆయన చురుకుగా పాల్గొని ప్రజా ఉద్యమాలకు విశేష సేవలందించారని కొనియాడారు. కృష్ణారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో అంతిమయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా జిల్లా కమిటీ సభ్యులు వజ్జే శ్రీను, సీపీఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, నాగం మల్లయ్య, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్, సీపీఎం నాయకులు  గుంట గాని ఏసు, సురకంటి వెంకటరెడ్డి, మేకల ఉపేందర్, తురక నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.