3 August, 2026 | 1:41 AM

కొత్తచెరువులో చేపల మృతి

03-08-2026 12:00 AM

నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటాం: గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ 

రాజేంద్రనగర్, ఆగస్టు 2 (విజయ క్రాం తి): రాజేంద్రనగర్ నియోజకవర్గం కోక పేట కొత్తచెరువులో ఆదివారం భారీగా చేపలు మృతి చెందాయి. చెరువులోకి భారీగా కలుషిత నీరు ఇతర రసాయన పదార్థాలు రావ డం వల్లే చేపలు పెద్ద ఎత్తున మృతి చెందాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

చేపలు మృతి చెందడంపై  సమాచారం అం దుకున్న గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ చెరువు దగ్గరకు వెళ్లి చేపల మృతికి గల కారణాలను తెలుసుకొని మత్స్యకారులను పరామర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చై ర్మన్ తలారి మల్లేష్ మాట్లాడుతూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన  మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.