మతసామరస్యానికి ప్రతీక ఆషాఢమాసం బోనాలు
తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వర్ణలతా రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఆషాడమాసం బోనాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని. బోనాల పండగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ న్యాయవా దుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్దన్ రెడ్డి సూ చించారు. ఆషాడమాసం బోనాల పండుగను పురస్కరించుకొని కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారులు బోనాలు, పోతరాజుల వేషాదరణలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగారి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతియేటా బోనాల ఉత్సవాలు నిర్వహించి పండుగల విశిష్టతను తెలి యజేయడానికి కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతలతో ప్ర శాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పి. స్వర్ణలతారెడ్డి, ఉపాధ్యాయులు మాదవి, భాస్కర్, ప్రసన్న, స్వప్న, విజయ్, మనిష్ షాలినితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






