3 August, 2026 | 1:40 AM

దివ్యాంగుడు అదృశ్యం

03-08-2026 12:00 AM

జవహర్‌నగర్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ దివ్యాంగుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్ననాటి నుండి మానసిక వైకల్యంతో బాధపడుతున్న అఖిల్ (24) జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. కాగా తన నివాసం నుండి గత ఆదివారం ఉదయం 11 గంటలకు బయటికి వెళ్లాడని ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ మేరకు అఖిల్ గురించి బంధువుల వద్ద వెతికినా స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎంతకీ సమాచారం లభించకపోవడంతో అఖిల్ తండ్రి  రామాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుడైన అఖిల్ కు సరిగ్గా మాటలు రావని కనీసం తన అడ్రస్ గానీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ గాని ఎవరికి చెప్పలేడని ఈ యువకుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోనే పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలని లేదా 9866784848 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.