12 August, 2026 | 2:42 PM

ఫారెస్ట్ బీట్ అధికారి మృతి కుటుంబానికి తీరని లోటు

12-08-2026 02:09 PM

మాజీ ఎంపీపీ దేవుల నాయక్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే...

కారేపల్లి విజయక్రాంతి: సింగరేణి మండల మాజీ ఎంపీపీ బానోత్ దేవుల నాయక్ కుమారుడు ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నవీన్ విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న వైరా మాజీ శాసనసభ్యులు లావుడ్య రాములు నాయక్ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరుకొని వెళ్లి మృతదేహానికి ఘన నివాళులర్పించారు.మృతుని తండ్రి మాజీ ఎంపిపి దేవుల నాయక్,ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.అనంతరం డీఎఫ్ఓ తో మాట్లాడి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సర్పంచ్ ధరావత్ మంగిలాల్, మాజీ సర్పంచ్ వాంకుడోత్ కృష్ణ ,సీనియర్ నాయకులు వాంకుడోత్ గోపాల్, అజ్మీరా వీరన్న, ఏన్కూరు నాయకులు బానోత్ సురేష్ తదితరులు ఉన్నారు.