11 April, 2026 | 3:08 AM

నయీం ప్రధాన అనుచరుడి మృతి

11-04-2026 01:22 AM

బెయిల్‌పై విడుదలై అజ్ఞాతంలోకి 

సైదాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించిన పులిమేటి శ్రీహరి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): నయీం ప్రధాన అనుచరుడిగా ఉన్న భువనగిరి జిల్లాకు చెందిన శ్రీహరి అజ్ఞాతంలో ఉంటూ హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాం తంలో తన నివాసంలో అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. నయీం ఎంకౌం టర్ తర్వాత శ్రీహరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సిట్ పోలీసుల ఒత్తిడితో 2017లో రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయాడు.

బెయిల్‌పై విడుదల అయినప్పటి నుంచి శ్రీహరి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. గుజరాత్‌లో జరిగిన సోహ్రాబుద్దిన్ హత్య కేసులో శ్రీహరి ప్రధాన నిందితుడు. హత్యలు, భూదందాలు, సెటిల్మెంట్లు నయీంతోపాటు ఎన్నో కేసుల్లో శ్రీహరి నిందితుడు. సైదాబాద్‌లోని నివాసంలో అనారోగ్యంతో మృతిచెందిన ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముసారంబాగ్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు చేయనున్నట్లు పేర్కొన్నారు.