నిర్మల్ కవికి సన్మానం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన ప్రముఖపద్యకవి, వ్యాఖ్యాత,సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా బి వెంకట్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరములో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పురస్కారమును స్వీకరించారు. రాజమహేంద్రవరములోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయములో చైతన్య సారస్వత పరిషత్,శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో 6,7వ తేదులలో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డా కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరీభూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డా టి పార్థసారథి, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ కె వి వి సత్యనారాయణరాజుల చేతుల మీదుగా ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పురస్కారమును ప్రముఖపద్యకవి డా బి.వెంకట్ అందుకున్నారు.*అవార్డ్ అందుకున్న కవికి నిర్మల కవులు రచయితలు అభినందనలు తెలిపారు.






